ఈరోజు ధర్మవరం ఆర్డీవో ఆఫీస్ ప్రాంగణంలో స్వచ్ఛభారత్ ట్రాక్టర్లను ప్రారంభించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని ఐదు పంచాయతీలకు ఐదు ట్రాక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. బత్తలపల్లి మండలం సంజీవపురం, మాల్యవంతం, ధర్మవరం మండలం మల్లకాల్వ, రావులచెర్వు, తాడిమర్రి మండలం దాడితోట పంచాయతీలకు వీటిని అందించింది.ప్రజలు కూడా స్వచ్ఛభారత్ కు సహకరించాలి. వీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు ముందుకు రావాలి. చెత్తను ఇష్టానుసారం పడేయకుండా స్వచ్ఛభారత్ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులోనే వేయాలి.జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టినప్పటి నుంచి నిరాటంకంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
మెరుగైన పారిశుద్ధ్యంతో ప్రజల ఆరోగ్యానికి హామీ లభిస్తుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది. అందువల్ల ప్రజలంతా స్వచ్ఛభారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అప్పుడే దేశం సుస్థిరాభివృద్ధిని సాధిస్తుంది.