అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మరికొద్దిసేపటిలో సమావేశం కానున్నది. ఈ సమావేశంలో పసుపు-కుంకుమ పథకాన్ని ఆమోదించనున్నరు. అలాగే మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడంపై చర్చిస్తారు. చుక్కల భూములపై చేయనున్న చట్టానికి సంబంధించి ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది. యువనేస్తం కింద నెలకు 2 వేల రూపాయిలు ఇచ్చే అంశంపై, రైతులకు కొత్త పథకం విధివిధానాలపై నిర్ణయం తీసుకోనున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa