గత 5 ఏళ్ళుగా రైతులకి ఇన్సూరెన్స్ పేరుతో ఒక పెద్ద డ్రామా నడిపించింది మర్చిపోయావా? 5 ఏళ్ళలో తమరి దరిద్రపు పాలనలో కేవలం ఖరీఫ్ లో మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించారు. రబీకి ఏ నాడూ ఒక్క రూపాయి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించలేదు. దాదాపుగా రూ.1600 కోట్లు ఇన్సూరెన్స్ ప్రీమియం బకాయిలు పెట్టి వెళ్లారు. పెద్దిరెడ్డి లాంటి కాంట్రాక్టర్‌కు వేల కోట్లు డబ్బులు ఇవ్వటానికి నీకు కోడ్ అడ్డు రాలేదు కానీ, ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టటానికి కోడ్ అడ్డు వచ్చిందా .రైతులని మోసం చేస్తూ, పంటల భీమా కట్టకుండా, కట్టేశాం అని చెప్పి, అసెంబ్లీలో అడ్డంగా దొరికిన చరిత్ర నీది జగన్.. మర్చిపోకు.. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు.. ఒక్క ప్రాజెక్ట్ నిర్వహణ సరిగా చేయలేదు. ఒక్క కాలువ పూడిక తీయలేదు. ధాన్యం బకాయిలు రూ.1600 కోట్లు పెట్టి పారిపోయావ్. కౌలు రైతుని ముంచేసావ్. నీ దరిద్రపు పాలనలో, 125 ఏళ్ళ నాటి కరువుతో, రైతు అల్లాడి పోయాడు. సాగు విస్తీర్ణం పడిపోయింది. రైతు భరోసా కింద ప్రతిరైతుకి రూ.13,500 ఇస్తానని, రూ.7,500 మాత్రమే ఇచ్చి మోసం చేసావ్. 64 లక్షల మంది రైతులకు రైతుభరోసా ఇస్తామని చెప్పి, 45లక్షలకు కుదించావ్. 15 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని, కేవలం 41 వేలకే పరిమితం చేశావ్. చంద్రబాబు గారు తెచ్చిన వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్, 100 శాతం సబ్సిడీపై సూక్ష్మపోషకాలు ఇవన్నీ రద్దు చేసావ్. ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేసావ్. చంద్రబాబు గారి హయాంలో రూ.3లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తుంటే, దాన్ని లక్షకి పరిమితం చేసావ్. ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇస్తానన్న పరిహారం ఎగ్గోట్టావ్. నువ్వు అన్ని లక్షల కోట్లు రైతులకి ఇస్తే, రైతు ఆత్మహత్యల్లో మనం మొదటి స్థానంలో ఎందుకు ఉన్నాం . 4 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గడం నీ వైఫల్యం కాదా..? రైతు భరోసా కేంద్రాల్ని రంగుల కేంద్రాలుగా రాజకీయ కేంద్రాలుగా మార్చింది మర్చిపోయావా .నీ దరిద్రపు పాలనలో, ఎన్నడూ లేనంత కష్టాల్లో రైతాగం ఉండింది పండిన పంటకు ధరలేదు, అమ్మితే ఖాతాల్లో డబ్బులు పడవు. సకాలంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ లేదు. ఇన్ పుట్ సబ్సిడీ లేదు, విపత్తు సాయం లేదు, పంట బీమా లేదు, డ్రిప్ సబ్సిడీ ఎగ్గొట్టారు. ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకుంది శూన్యం.. ఒక్కో రైతు నెత్తిన రూ 2.75 లక్షల అప్పు మోపారు. . వ్యవసాయంలో వృద్ది టిడిపి హయాంలో 11.2% ఉంటే, వైసిపి హయాంలో 6.01%కు దిగజార్చారు. దాదాపు సగానికి వృద్దిరేటును పతనం చేశారు. పశుసంవర్ధకంలో టిడిపి హయాంలో వృద్ది 13% ఉంటే గత 4ఏళ్లలో 5.9%కు పతనం చేశారు. లైవ్ స్టాక్ గ్రోత్ రేటు 7.1% దిగజార్చారు. ఉద్యాన రంగంలో టిడిపి హయాంలో వృద్ది 12.9% ఉంటే, మీరు 6.1%కు పతనం చేశారు.. అంటే హార్టీకల్చర్ లో వృద్ధి మైనస్ 6.8%. టిడిపి ప్రభుత్వంలో ఆక్వా కల్చర్ వృద్ధి 28.9% ఉంటే, వైసిపి నాలుగేళ్లలో 9.2%కు దిగజార్చారు. ఆక్వాలో గ్రోత్ ను మైనస్ 19.7%కు పతనం చేశారు. హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా 10%నుంచి 4%కు పతనమైంది. అందుకే రైతులకు గిట్టుబాటు ధరలు అందని దుస్థితి నెలకొంది.చంద్రబాబు గారు రాగానే మొదటి ప్రాధాన్యం ఇచ్చిందే రైతులకు. గత 50 రోజుల పాలనలో, నువ్వు పెట్టి వెళ్ళిన రూ.1600 కోట్లు ధాన్యం బకాయిలలో రూ.1000 కోట్లు విడుదల చేసారు. వరదల్లో ఇబ్బంది పడ్డ రైతులకు 80% సబ్సిడీతో విత్తనాలు ఇచ్చారు. రాష్ట్రంలో డ్యాంలు అన్నీ నిండి వ్యవసాయ పనులు చేసే వాళ్ళు పెరిగారు. ఈ సారి ఎక్కువ విస్తీర్ణంలో పంటలు వేస్తున్నా, ఎక్కడా విత్తన కొరత లేకుండా చుస్తున్నారు. భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు తిరిగి పంటలు వేసుకునేందుకు వీలుగా రూ.36 కోట్లను ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేసారు. త్వరలోనే అన్నదాత కార్యక్రమం మొదలవుతుంది. ప్రతి రైతుని ఆదుకునే బాధ్యత మాది. చంద్రబాబు గారు రాగానే వర్షాలు పడ్డాయి. రైతులు సంతోషంగా వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. తమరు కొంచెం ఆత్రం ఆపుకుంటే, అందరికీ మంచిది.రైతు బాగుంటేనే… రాష్ట్రం బాగుంటుందనేది, నువ్వు అధికారంలో ఉండగా తెలుసుకుని ఉంటే, రైతులు ఆత్మహత్యల్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేది కాదు. నిన్ను పులివెందుల ప్రజలు ఎమ్మెల్యే చేసింది, బెంగుళూరులో హాలిడే ఎంజాయ్ చేస్తూ, ట్వీట్లు వేయటానికి కాదు, అసెంబ్లీకి వచ్చి సమస్యలు చెప్పటానికి.. గుర్తుపెట్టుకో జగన్