అమరావతిలో అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు 12 ఎకరాలు ఇచ్చారని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం రూ.175 కోట్లతో విజయవాడలో ఏర్పాటు చేస్తామని అన్నారు కానీ, రూ.400 కోట్లతో బడ్జెట్ పెంచి అంబేద్కర్ పేరుతో అవినీతి చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ, జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ పేరు కన్నా పెద్దగా జగన్ పేరు ఉండటం దళితులకు నచ్చలేదని చెప్పారు. 27 పథకాలు రద్దు చేసి, రూ.42 వేల కోట్లు నిధులు మళ్లించినప్పుడు దళిత సంఘాలనేతలు ఏమయ్యారని ప్రశ్నించారు. 188 మంది దళితులను వైసీపీ ప్రభుత్వంలో చంపేస్తే ఏం చేశారని నిలదీశారు. దళితుల మీద ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టినప్పడు దళిత నేతలంతా ఏమయ్యారని అడిగారు.