BJP ఎంపీ బాన్సురీ స్వరాజ్‌కు ఢిల్లీ హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమెపై పోటీ చేసిన AAP నేత సోమనాథ్ భారతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాన్సురీ స్వరాజ్‌తో పాటు ఆమె తరుపు ఏజెంట్, అనుచరులు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని పిటిషన్లో ఆరోపించారు. ఆమె ఎన్నిక చెల్లదని హైకోర్టులో సవాల్ చేశారు. 30 రోజుల్లోగా దీనిపై జవాబివ్వాలని బాన్సురీని కోర్టు ఆదేశించింది.