జనాభా వృద్ధిరేటు గణనీయంగా తగ్గుతున్న వేళ చైనా కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లకు సంబంధించిన చట్టాల్లో కీలక మార్పులు తెస్తూ డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. విడాకులను తగ్గించేందుకు వీలుగా వీటిల్లో కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. విడాకులకు 30రోజుల కూలింగ్ పీరియడ్‌ను కూడా ఇవ్వాలని పేర్కొంది.జంటలో ఏ ఒక్కరైనా విడాకులకు ఇష్టపడకపోతే..వారు దరఖాస్తును వెనక్కి తీసుకోవచ్చు. ఆ తర్వాత విడాకుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేస్తారు.