అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారని గుర్తు చేసిన మాజీ మంత్రి, కాకాణి గోవర్థన్‌రెడ్డి వాటన్నింటికీ పచ్చ రంగు ఎందుకు వేశారని నిలదీశారు. ఇంకా.. ఆ క్యాంటీన్లలో పెద్ద పెద్ద ఫొటోలు నీవి, విరాళాలు ప్రజలవా? అని చంద్రబాబును ప్రశ్నించారు. పథకాలు ఎత్తేసి, పేదవాడికి పప్పన్నం పెడుతున్నారని.. దాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారన్న కాకాణి, అది కూడా ప్రభుత్వ సొత్తుతో కాకుండా విరాళాలతో చేయడం విడ్డూరమన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా మరోసారి పవన్‌కళ్యాణ్ తన ఆజ్ఞానాన్ని చాటారని మాజీ మంత్రి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2017లో జరిగిన సుగాలి ప్రీతి కేసును, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ముచ్చుమర్రి బాలిక కేసును.. గత జగన్‌గారి ప్రభుత్వానికి ఆపాదించారని గుర్తు చేశారు. తాను ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నానన్న విషయాన్ని పవన్ మర్చారని కాకాణి గోవర్థన్‌రెడ్డి చురకలంటించారు.