నాగలాపురం మండలం సురుటపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో రేపు శని మహా ప్రదోషకాల పూజలు జరుగుతాయని ఆలయ ఇంచార్జ్ ఈవో రామచంద్రారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు ఆస్థాన నందీశ్వర స్వామికి విశేష అభిషేకాలు జరుగుతాయన్నారు. ఈ ప్రదోష పూజల్లో పాల్గొన్న భక్తులకు అన్ని రకాల గ్రహదోషాలు దూరమవుతాయని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa