తెనాలి పట్టణంలో మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తో కలిసి మూడు అన్న క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు వారు పేదలతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క పేదవాడికి అన్న క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.