కొరిశపాడు మండలం మేదరమెట్లలో శుక్రవారం స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జై గౌడ్ ఉద్యమ సంఘం అధ్యక్షులు మోరపాకుల లక్ష్మణ స్వామి గౌడ్ పాల్గొన్నారు. తొలుత సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గౌతు లచ్చన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.