ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుంగభద్ర నీటిని కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 10:41 AM

తుంగభద్ర నీటిని కాపాడుకునేందుకు చేస్తున్న భగీరథ ప్రయత్నంలో తొలి అడుగు విజయవంతంగా పడింది. కొట్టుకుపోయిన 19వ నంబరు క్రస్ట్‌గేటు స్థానంలో స్టాప్‌లాగ్‌ ఏర్పాటు ప్రక్రియ సాఫీగా ముందుకు పడింది. ఇంజనీర్లు, కార్మికుల నిరంతర శ్రమ ఫలించింది. స్టాప్‌లాగ్‌లోని తొలి ఎలిమెంట్‌... శుక్రవారం రాత్రి 9.05 గంటలకు భద్రంగా కిందికి దిగి ప్రాజెక్టు బెడ్‌లెవెల్‌పై కూర్చుంది. దీంతో తుంగభద్ర జలాశయం వద్ద సంబరాలు మిన్నంటాయి. ఇంజనీరింగ్‌ అధికారులు, కార్మికులు, అధికారులు పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. ఆనందంతో మిఠాయిలు పంచుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com