చిట్వేలి మండలం గాంధీ నగర్ కు చెందిన వల్లెపు కిట్టయ్య కుటుంబసభ్యులు శుక్రవారం చిట్వేలి మండలంలో నూతనముగా నిర్మిస్తున్న బ్రహ్మంగారి మఠం నిర్మాణమునకు 30, 555 రూపాయలు విరాళం అందజేశారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికి వీరబ్రహ్మేంద్ర స్వామి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నామని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ధర్మకర్త కట్టా రామమోహన్ నాయుడు తెలిపారు.