వారణాసి నుండి అహ్మదాబాద్ వెళ్తున్న సబర్మతి ఎక్స్ప్రెస్ యొక్క ఇరవై రెండు బోగీలు పట్టాలు తప్పాయి.. ఉదయం 2:35 గంటలకు కాన్పూర్ దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.. పలువురికి మాత్రం చిన్న చిన్న గాయాలయ్యాయి.ప్రయాణికులకు బస్సులు ఏర్పాటు చేసి సమీప రైల్వే స్టేషన్కు తరలించారు.