చెట్లు ప్రగతికి మెట్లు.. చెట్లు పెంచండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి.. అని ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ పరిరక్షణ ప్రియులు చెప్పే విషయం. అయితే చెట్లు ప్రకృతి అందాలను పెంచడమే కాదు.. నేల పటుత్వాన్ని పెంచుతాయి. భూసారాన్ని చక్కగా కాపాడతాయి. వ్యవసాయంలోను చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. భూమి మీద ఉన్న ప్రతి జీవకోటికి ప్రాణాధారం చెట్లు. అలాంటిది మొక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది.