కలకత్తాలో మహిళా పిజి వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు చేపడుతున్న సమ్మెకు ఆదివారం భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ)మద్దతు తెలియజేసింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎం. గంగా సూరిబాబు మాట్లాడుతు జూనియర్ డాక్టర్ పై పాశవికంగా మూకుమ్మడి అత్యాచారం చేసి హత్యకు పాల్పడినట్లు పోస్టుమార్టం రిపోర్టు చెప్పడం జరుగుతుందని తెలిపారు.