న్యూఢిల్లి : కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో రైతుల గురించి అతి తక్కువగా మాత్రమే పట్టించుకున్నారని కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ అన్నారు. ఈ బడ్జెట్ వల్ల రైతులకు పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదని ఆయన చెప్పారు. మధ్య తరగతి వర్గాలకు పన్ను మినహాయింపు స్వాగతించదగిన అంశమేనని, దానిని తాము కూడా చేయగలమని ఆయన చెప్పారు. రైతుల విషయంలోనే అతి తక్కువ మొత్తాన్ని కేటాయించారని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa