కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడిని మంత్రి టీజీ భరత్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పెద్ద బ్రాండ్ అని అన్నారు. రాష్ట్రానికి పెద్ద..పెద్ద.. పరిశ్రమలు వస్తాయని నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. చాలా మంది పారిశ్రామిక వేత్తలు చంద్రబాబుని కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అడిగినవని కేంద్రం వెంటనే మంజూరు చెయ్యాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు చెప్పారు. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవుతుందని వెల్లడించారు. అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి భరత్ స్పష్టం చేశారు.