కోల్కత్తాలో వైద్యవిద్యార్థినిపై హత్యాచారాన్ని నిరసిస్తూ సోమవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోడుమూరు పద్మావతి కళాశాల విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. కళాశాల నుంచి కొత్తబస్టాండ్ మీదుగా అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి మాట్లాడుతూ కోల్కత్తాలో వైద్యవిద్యార్థినిపై హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో ఎమ్మార్పీఎస్ నాయకులు మద్దతు ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐ ఎస్ఎఫ్ నాయకులు రామాంజనేయులు, ఇంద్ర, కిషోర్ పాల్గొన్నారు.