కలకత్తాలో ట్రైనీ డాక్టర్ ఫై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మంగళవారం రాత్రి డివైఎఫ్ఎస్ఐ ఆధ్వర్యంలో ఆర్. ఎం. పి డాక్టర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జమ్మలమడుగులో మాట్లాడుతూ. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేయాలన్నారు. డాక్టర్ మౌమిత దేవనాథ్ కు జరిగిన ఘటనపై సీబీఐ ద్వారా త్వరగతిన విచారణ చేపట్టాలన్నారు.