మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఆదేశించారు. ఈమేరకు అమరావతి నుంచి కలెక్టర్ తో మంత్రి బుధవారం ఫోన్ లో మాట్లాడారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నడుమ భారీ వర్షాల కురవడం ఆనందంగా ఉందన్నారు.