ధర్మవరం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కండక్టర్ రమణప్ప నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని కోట కురుబ కాలనీకి చెందిన సాకే లలిత ధర్మవరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేశారు. పీఆర్టీ కాలనీలో తన భర్త సాకే కుళ్లాయప్ప టైలరింగ్ షాప్ నిర్వహిస్తున్నాడని అక్కడికి వెళ్లిన రమణప్ప తన భర్తను దుర్భాషలాడి చంపుతానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకటో పట్టణ పోలీసులు రమణప్పపై కేసు నమోదు చేశారు.