ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ నైనీటాల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఈ-రిక్షాను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నిండు గర్భిణీ సహా నలుగురు మృతి చెందారు. పురిటి నొప్పులు రావడంతో గర్భిణి ఆస్పత్రికి వెళ్లింది. డెలివరీకి ఇంకా సమయం ఉందని వైద్యుల వెల్లడించడంతో ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.