భారత్ నుంచి పారిపోయి మలేషియాలో ఆశ్రయం పొందుతున్న వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ అప్పగింతపై మలేసియా నుంచి సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. జకీర్ నాయక్‌కు సంబంధించి తగిన ఆధారాలు సమర్పిస్తే.. భారత్ చేసిన అప్పగింత అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటామని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం చెప్పారు. భారత్-మలేసియా ద్వైపాక్షిక సంబంధాల ఉన్నతీకరణకు అది అడ్డుపడొద్దని వ్యాఖ్యానించారు.