కేరళకు చెందిన ఓ మహిళ తన భర్త వీర్యాన్ని భద్రపరచడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించింది. కొద్ది కాలంగా తన భర్త తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తమకు సంతానం లేదని ఆమె పేర్కొంది. భవిష్యత్తులో తాను సంతానాన్ని కనడానికి ఉపయోగపడేలా భర్త వీర్యాన్ని భద్రపరచడానికి అనుమతించాలని కోర్టును కోరింది. మహిళ అభ్యర్థనను స్వీకరించిన కేరళ హైకోర్టు భర్త నుంచి వీర్యం సేకరించి,భద్రపరచడానికి అనుమతిచ్చింది.