ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుద్ధం ఎఫెక్ట్.. పడిపోయిన అరటి ధరలు

national |  Suryaa Desk  | Published : Mon, Mar 16, 2026, 11:25 AM

 పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతులు నిలిచిపోవడంతో రాష్ట్రంలోని అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేవలం రెండు వారాల్లోనే అరటి టన్ను ధర రూ.20-23వేల నుంచి రూ.6-8వేలకు పడిపోయింది. స్థానికంగానూ వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో సుమారు లక్ష ఎకరాల్లో అరటి సాగు జరుగుతోంది. యుద్ధం ఇలాగే కొనసాగితే ధరలు మరింత పడిపోతాయని రైతులు అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa