సెబీ చీఫ్ మాధాబి పూరీ బుచ్ రాజీనామా చేయాలని గురువారం కర్నూలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కె. బాబురావు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, జిలాని బాష ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీకి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.