పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో ఒకే రోజు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా ప్రతి గ్రామంలో సభలు మొదలుపెట్టారు. వీటిలో కోటి మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. తమ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులకు తీర్మానాలు చేసుకొని ఆమోదించుకున్నారు. రూ.4500 కోట్లు విలువైన పనులకు నేటి గ్రామ సభల్లో ఆమోదం లభించింది. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో కోటి మందికిపైగా ప్రజలు భాగస్వామ్యంతో రూ.4,500 కోట్లు విలువైన పనులకు ఆమోదం చేసుకోవడం ప్రపంచ స్థాయి రికార్డుగా నిలుస్తుంది. నేటి గ్రామ సభల ద్వారా 87 రకాలైన పనులకు ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేందుకు అవకాశం లభించింది. 9 కోట్ల పని దినాలతో, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన జరుగుతుంది. పంచాయతీ పరిధిలోని వారంతా కూర్చొని గ్రామాభివృద్ధి మీద నిర్ణయాలు తీసుకొనేలా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో, పారదర్శకంగా నిధులు వెచ్చించుకొనేలా గ్రామ సభలను నిర్వహిస్తున్నారు
.