విశాఖలో ఓ కారు యజమాని ఫ్రస్టేషన్ ఆకాశాన్నంటింది. కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న ఒక కారు షోరూమ్‌లో సదరు వ్యక్తి తన కారును సర్వీసింగ్‌కు ఇచ్చాడు. వాళ్లు తూతూ మంత్రంగా సర్వీసింగ్ చేసి ఇచ్చారు. దీంతో సర్వీసింగ్ బాగా చేయలేదని, షోరూంకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. అయినా సరే షోరూం వాళ్లు పట్టించుకోలేదు. దీంతో ఫ్రస్టేషన్‌కు గురైన కారు యజమాని కారుతో వాచ్ మెన్‌పై దాడి చేసి.. షోరూంలో ఫర్నిచర్‌పై పెట్రోల్ పోశాడు. ఈ మేరకు షోరూం మేనేజ్మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.