గత 20 సంవత్సరాలనుండి ప్రజలకోసం పోరాటం చేస్తున్న వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గమని సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. సీఎం చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమి నేరం చేశారని దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టారని ప్రశ్నించారు.చాలాచోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని అన్నారు. కానీ పిన్నెల్లి పై మాత్రమే కేసు పెట్టారని చెప్పారు. అందుకే ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉందని తెలిపారు.చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆయన బంధువులు. కుటుంబ సభ్యులు.. సన్నిహితులు.. శ్రేయోభిలాషులు అందరూ తల్లడిల్లి పోయారని తెలిపారు. ఏది ఏమైనా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నామని అన్నారు.