అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ షాక్ తగిలింది. జిల్లా ఎస్పీ జగదీశ్ సోమవారం పెద్దారెడ్డికి నియోజకవర్గ బహిష్కరణ వేటు వేస్తున్నట్లు ఇంటికి నోటీసులు పంపించారు. తాము అనుమతి ఇచ్చే వరకు పెద్దారెడ్డి నియోజకవర్గంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదన్నారు. అయితే పెద్దారెడ్డి తాడిపత్రికి వెళతానని, అక్కడి నుంచే రాజకీయాలు చేస్తానని ఆయన చేసిన ప్రతిజ్ఞకు బ్రేక్ పడినట్లయింది.