గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని విజయవాడ డీసీపీ హరికృష్ణ సోమవారం అన్నారు. విజయవాడ 1టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి సేవిస్తున్న 118 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.