అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక గర్భం తొలగించుకునేందుకు బాంబే హైకోర్టు మంగళవారం అనుమతించింది. న్యాయమూర్తులు జస్టిస్ గడ్కరీ, జస్టిస్ నీలా గోఖలే ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. బాలికపై బంధువు ఒకరు అత్యాచారం చేశారు. ఆమె ప్రస్తుతం 26 వారాల గర్భిణి. 24 వారాల కంటే ఎక్కువ కాలం గర్భంతో ఉంటే అబార్షన్‌కు కోర్టు అనుమతి తప్పనిసరి. దీంతో ప్రముఖ న్యాయవాది మనీషా జగ్తాప్ ద్వారా బాధిత బాలిక హైకోర్టును ఆశ్రయించింది.