సాధారణంగా స్కూల్ పిల్లలకు, ఆఫీస్ ఉద్యోగులకు సెలవులు రావడం కామన్. అందులో ప్రభుత్వ సంస్థలకు అయితే హాలీడేస్ కాస్త ఎక్కువగా ఉంటాయి.అలా ప్రతి నెలలో ఎన్నో కొన్ని సెలవులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందుకే కొత్త నెల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. కొత్త నెలలో ఏయే రోజుల్లో స్కూల్స్కి హాలీడేస్ ఉన్నాయో తెలుసుకునేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అలా చూస్తున్న విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది. మరి.. సెప్టెంబరు నెలలో పెద్ద సంఖ్యలోనే సెలవులు ఉన్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దామా…మరో నాలుగు రోజుల్లో సెప్టెంబర్ నెల ప్రారంభం కానుంది. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్నాయి. అయితే ఈ ఐదు రోజులు అనేవి రెండు రాష్ట్రాల్లో కలిపి ఉండనున్నాయి.
సెప్టెంబర్ 7- వినాయక చవితి శనివారం వస్తుంది దీంతో సెప్టెంబర్ 8- ఆదివారం ఉండడంతో వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.
ఇక సెప్టెంబర్ 14- రెండో శనివారం సెప్టెంబర్ 15- ఆదివారం సెప్టెంబర్ 16- మిలాద్-ఉన్-నబీ దీంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. విద్యార్ధులతో పాటు ఉద్యోగులకు కూడా ఈ సెలవులు కలిసి వచ్చాయి.ఇదిలా ఉండగా, సెప్టెంబర్ నెలలో బ్యాంకులు ఏకంగా 14 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. వివిధ పండగల, ఇతర కార్యక్రమాల వల్ల ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు. విద్యార్థులకు మాత్రం ఏకంగా ఐదు రోజులు హాలిడేస్ వచ్చాయి. తాజాగా హాలిడేస్ లిస్ట్ తెలియడంతో కొందరు విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. దీంతో ఈ సెలవు రోజుల్లో ఎక్కడైనా టూర్ ప్లాన్ చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. మొత్తంగా వచ్చే నెలలో కొన్ని రోజుల వ్యవధిలో ఏకంగా ఐదు సెలవులు రానున్నాయి.