ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకెళతాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 28, 2024, 10:17 PM

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి ఘట్టాన్ని ఒక రికార్డుగా ముందుకు తీసుకెళ్లామని చంద్రబాబు గుర్తుచేశారు. నాడు కేంద్ర ప్రభుత్వంలో ఉండే అప్పటి మంత్రులు ఉమా భారతి, నితిన్ గడ్కరీల సహకారంతో ముందుకు వెళ్లామని అన్నారు. ‘‘ముందు రాష్ట్ర నిధులు చెల్లిస్తే కేంద్రం తర్వాత రీఎంబర్స్ చేసింది. 2019లో ప్రభుత్వం మారింది. మరలా పోలవరం ప్రాజెక్టుకు శనిగ్రహం దాపరించింది. ఆకస్మిక తనిఖీలు చేశాం. పోలవరం కోసం 82 సార్లు రివ్యూ చేశాం. 25 సార్లు వర్చువల్‌గా చేశాం. ఇంత విలువ కలిగిన ప్రాజెక్టును విలువ తెలియని వ్యక్తులు నాశనం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు 7 మండలాలు కావాలని తాను అడిగితే... జగన్ అధికారంలోకి వచ్చిన రోజు సాయంత్రమే కాంట్రాక్టర్‌ను సైట్‌లో ఉండొద్దని ఆర్డరు ఇచ్చారు. దాని పర్యవసానం చూస్తే ఇంత దారుణం జరిగింది. 2 సీజన్ ల లో ప్రాజెక్టు ను గాలికి వదిలేసి రివర్స్ టెండర్ అని పైశాచిక ఆనందం పొందారు. ఆగస్టు 2020లో నీరు వచ్చి సుడులు తిరగడం డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాం‌మ్‌లు దెబ్బతిన్నాయి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.‘‘పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను డైవర్ట్ చేశారు. పీపీఏ ప్రాజెక్టు విషయంలో ముందుకు వద్దు. బాధ్యత ఫిక్స్ చేయలేం అన్నారు. మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇష్టానుసారం చేశారు. దీంతో 6 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాం. ఒక వ్యక్తి అవగాహన లోపం వల్ల జాతికి ఎంత నష్టం కలిగిందో చూశాం. మేము, బీజేపీ, జనసేనలు కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం చేపడతాం అని చెప్పాం. అందులో భాగంగా తిరిగి పోలవరం ప్రాజెక్టును ట్రాక్‌లో పెట్టాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com