ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాగునీటి సమస్య పరిష్కరించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 28, 2024, 11:18 PM

కడప నగరంలో తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపాలని కడప ఎమ్మెల్యే మాధవి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి ఇరిగేషన మంత్రి రామానాయుడిని కోరారు. ఈ మేరకు మంగ ళవారం వారు అమరావతిలో మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరంలో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చే నిధులతో పెన్నానదిపై తలపెట్టిన చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. గత ప్రభుత్వంలో నీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఆ సమయంలో పట్టించుకునే నాధుడులేడన్నారు. మన ప్రభుత్వంలో అయినా శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రికి విన్నవించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com