భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. భారత మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఆ కేసు కొట్టివేయడానికి ఉన్న వాదనలతో కూడిన ఒక చిన్న నోట్‌ను సమర్పించాలని సింగ్ లాయర్‌ను ఆదేశించింది. అందుకు గాను కొంత సమయం ఇచ్చింది.