వైసీపీ సభ్యుల పార్టీ మార్పుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందించారు. వైయస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని దెబ్బ తీయాలని చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఫైర్ అయ్యారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. చివరికి 23 సీట్లకే చంద్రబాబు పరిమితం అయ్యారు. రాజీనామా చేసి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తామని చంద్రబాబు గ్యారెంటీ ఇస్తారా?. కొందరిని ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ప్రజలను దృష్టి మరల్చేందుకు రాజ్యసభ సభ్యుల్ని పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తున్నారు. గతంలో పార్టీ మారినవారు కాలగర్బంలో కలిసిపోయారు. పార్టీ వీడితే వచ్చే నష్టమేమీ లేదు అని అన్నారు.