కర్నూలు జిల్లా, చాగలమర్రి పరిసర గ్రామాల్లో పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతు పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సూచించారు. గురువారం సాయంత్రం మండలంలోని ముత్యాలపాడు గ్రామంలో జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణతో కలిసి రైతులు సాగు చేసిన పంట పొలాలను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. తహసీల్దార్ రవికుమార్, ఏవో రంగనేతాజీ, వీఆర్వో చంద్ర నాయక్, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.