జమ్మలమడుగు కాపు వీధిలో శుక్రవారం కిందికి వేలాడిన విద్యుత్ తీగలను డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ పట్టణంలోని కాపు వీధి, గంగమ్మ దేవాలయం, నెహ్రునగర్, ఎస్పిజి క్వార్టర్స్ తదితర వార్డులలో విద్యుత్ వైర్లు ప్రమాదకరం గా వున్నాయన్నారు. కాపు వీధిలో స్కూల్స్, కాలేజీలు, విద్యార్థులు నిత్యం రద్దీగా వుండే ప్రాంతం అన్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే ప్రమాదం పొంచివుందన్నారు.