బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిసా తీరాల్లో పశ్చిమ మధ్యబంగాళాఖాతంలో వాయవ్యంగా వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ శనివారం రాత్రికి విశాఖ -గోపాలపురం మధ్య కళింగపట్నం వద్ద తీరదాటుతుందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు శనివారం బులిటెన్ విడుదల చేసింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa