విజయవాడలో వర్షం సృష్టించిన విళయం అంతా ఇంతా కాదు. ఎడతెరిపిలేని వర్షం వల్ల నగరం అతలాకుతలమైంది. నగరంలో ఒకరోజు వ్యవధిలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, గత 30 ఏళ్లలో ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు.
ఈ మేరకు పలు కాలనీల్లో 4 అడుగుల మేర నీరు నిలిచింది. భారీ వరదకు బుడమేరు కట్ట, అంబాపురం పాముల కాలువ, వాగులేరు కట్టలు తెగటంతో సుందరయ్య నగర్, ప్రకాష్ నగర్ రహదారులు జలమయమయ్యాయి. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa