ఏపీలో భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని ఎంతలా అస్తవ్యస్తం చేశాయో తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు ఎంతగానో ఇబ్బందిపడ్డారు. వరదల రోడ్లపైకి రావడంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 30 గంటల తర్వాత ఉపశమనం దక్కింది. రాకపోకలు పునరుద్ధరణ జరిగింది. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద వరద ప్రవాహం తగ్గింది. దీంతో ఒక్కొకటిగా వాహనాలను అధికారులు అనుమతి ఇస్తున్నారు. గడిచిన 30 గంటలుగా జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిన విషయం తెలిసిందే. నిన్న మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపై నిలిచి ఉండడంతో అధికారులు అనుమతి ఇస్తున్నారు.