మద్యం మత్తులో తోటి సహోద్యోగిని ఈతకొలనులో నెట్టేయడంతో మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..తేజ( 24) అనే ఐటీ ఉద్యోగి ఆదివారం ఘట్కేసర్ లోని ఓ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన సహోద్యోగి బర్త్ డే పార్టీకి హాజరయ్యాడు.
ఈ క్రమంలో ఈత రాదని చెబుతున్నా మద్యం మత్తులోని సహోద్యోగులు ఈతకొలనులో నెట్టేయడంతో తేజ నీట మునిగి చనిపోయాడు. రంజిత్ రెడ్డి, సాయికుమార్, శ్రీకాంత్ తో పాటు గెస్ట్ హౌస్ నిర్వాహకుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.