విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముదినేపల్లి మండలంలోని పలు సంఘాలు నడుం బిగించాయి. గురజ గ్రామ యువకులు రెండు వాహనాల ఆహార పొట్లాలు, ముదినేపల్లి మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చీదెళ్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు, వాసవీ సేవా దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వత్తుమిల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో 20 లీటర్ల సామర్థ్యం కలిగిన 300 వాటర్ క్యాన్లు, ముదినేపల్లి రజక సంఘం అధ్యక్షుడు యలకుర్తి నాగరాజు, ఉపాధ్యక్షుడు మీసాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు, ముదినే పల్లిలోని పరసా వారి శ్రీ లక్ష్మీ ట్రేడర్స్, మంగినేని ప్లై ఉడ్స్ అండ్ హార్డ్వేర్ సంస్థ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు సరఫరా చేసి అక్కడి ట్రస్టుల ద్వారా బాధితులకు అందజేశారు.