ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబులెన్స్‌లో మహిళపై లైంగిక వేధింపులు.. ఆక్సిజన్ అందక భర్త మృతి

national |  Suryaa Desk  | Published : Thu, Sep 05, 2024, 05:11 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో దారుణం జరిగింది. సిద్ధార్థనగర్ కు చెందిన మహిళ ఇటీవల తన భర్తను ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ చేసింది. ఖర్చులు భరించలేక భర్తను తీసుకుని ప్రైవేట్ అంబులెన్స్‌లో ఇంటికి బయలుదేరింది.
ఈ క్రమంలో ముందు సీట్లో కూర్చొన్న మహిళపై అంబులెన్స్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహిళ నిరాకరించడంతో వారిని రోడ్డుపై దించేసి వెళ్లారు. ఈ క్రమంలో భర్తకు ఆక్సిజన్ అందక మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com