వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అమరావతిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేశ్‌తో పాటు మరికొందరు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.బుధవారం నుంచి నందిగం సురేశ్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇంటి వద్ద లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వైసీపీ నేత తన ఫోన్‌ను కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నాడని గుర్తించిన పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టడంతో రెండు వారాల రిమాండ్ విధించింది.