అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై తిరుపాల్ నాయక్ హెచ్చరించారు. గురువారం రాబడిన సమాచారం మేరకు సిఐ సురేష్ రెడ్డి ఆదేశాల ప్రకారం తన సిబ్బందితో కలిసి టి. వెలమవారిపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై దాడులు చేశామన్నారు.
ఈ దాడుల్లో 13 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న రూ. 30 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.