ఆపదలో ఉన్నవారికి అన్నదానం చేస్తే ఆత్మ సంతృప్తి కలుగుతుందని మాజీ శాసనమండలిసభ్యులు వైవిబి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. తోట్లవల్లూరు మండలంలోని వరద ప్రాంత ముంపు బాధితులకు ఏర్పాటు చేసిన పునరావస కేంద్రంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకు ఉన్న దానిలోనే ఆపదలో ఉన్న వారి ఆకలిని తీరిస్తే ఆత్మ సంతృప్తి కలగటంతో పాటు సమాజంలో మంచి గుర్తింపు కూడా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa