ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సెటైర్లు వేశారు. గత ఐదేళ్లు షర్మిల తెలంగాణలో తిరిగారని.. ఎన్నికలకు ముందే ఏపీలో అడుగుపెట్టారని చెప్పారు. షర్మిల తెలంగాణ వరదల గురించి మాట్లాడారో లేక మన రాష్ట్ర వరదల గురించి మాట్లాడారో తనకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఏపీలో వచ్చిన వరదలు ప్రకృతి వైపరీత్యం కాదని... ప్రభుత్వం సృష్టించిన వరదలని అన్నారు. వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ వల్లే వరదలు వచ్చాయంటూ కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని చెప్పారు.
![]() |
![]() |