విజయవాడను ముంచెత్తిన వరదల్లో ముందు నుంచి చోటు చేసుకున్న వైఫల్యాలను కప్పి పుచ్చడానికే ప్రభుత్వం బోట్ల డ్రామా ఆడుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. నిజానికి ప్రకాశం బ్యారేజ్‌ను ఢీ కొట్టిన పడవలు టీడీపీ వారివే అని ఆయన స్పష్టం చేశారు. అయినా వాటిని వైయస్సార్సీపీకి అంటగట్టడం దారుణమన్న అంబటి, ఆ నింద మోపి తమ పార్టీ నాయకులను వేధిస్తున్నారని తెలిపారు. మంగళవారం వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దారుణంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న మాజీ మంత్రి, ఈ వయసులో ఎందుకీ కుట్రలు, కుతంత్రాలు? అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు విజనరీ, అడ్మినిస్ట్రేషన్ ఏమైందన్న ఆయన, ఈ వరదల్లో ప్రజల ప్రాణాలు ఎందుకు కాపాడలేకపోయారని ప్రశ్నించారు.